ప్రవక్తపై వ్యాఖ్యలు: అరబ్‌ దేశాల నిరసన

ప్రవక్తపై వ్యాఖ్యలు: అరబ్‌ దేశాల నిరసన

మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై అరబ్‌ దేశాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ముఖ్యంగా కతర్ విదేశంగా శాఖ.. భారత్‌ దౌత్యవేత్తను పిలిపించుకుని తమ నిరసన తెలిపింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండిస్తుందని భావిస్తున్నామని కతర్‌ పేర్కొంది.అయితే ఆ నేతల వ్యక్తిగత వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని భారత రాయబారి దీపక్ మిట్టల్ వివరణ ఇచ్చుకున్నారు. వారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండించినట్లు పేర్కొన్నారు అలాగే కువైట్‌, ఒమన్‌ దేశాలు కూడా భారత్‌కు తమ నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యాఖ్యలు జరిగినప్పటి నుంచి మౌనంగా ఉన్న పాకిస్తాన్‌ ప్రధాని అరబ్‌ దేశాలు అభ్యంతరం తెలిపిన తరవాత స్పందించారు. ప్రవక్తపై బీజేపీ ప్రతినిది వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆ దేశ ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రవక్తపై బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యలకు నిరసనగా తమ దేశంలో పర్యటిస్తున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‌ రద్దయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే దీన్ని కతర్‌ ఖండించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య గౌరవర్థం ఇస్తున్న విందులో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. కతర్‌ ప్రధాని షేక్‌ ఖాలిద్‌ బిన్‌ ఖలిఫా బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల థనీని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలుస్తున్నారు. మరోవైపు ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్‌ శర్మతో పాటు ట్వీట్‌ చేసిన ఢిల్లీ మీడియా డిప్యూటీ ఇంచార్జి జిందాల్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

Related Articles

Leave a Reply