మొహరం నెల ప్రారంభం

మొహరం నెల ప్రారంభం

ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో తొలి నెల మొహరం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. మొహరం పదవ రోజు ఆషూరా జరుపుకుంటారు. కర్బలా యుద్ధం జరిగిందే ఈ నెలలోనే. ఉమయ్యద్‌ యాజిద్ I సైన్యానికి మహమ్మద్‌ ప్రవక్త మనవడు, హజరత్‌ అలీ కుమారుడు ఇమామ్‌ హుసేన్‌ మధ్య కర్బలాలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇమామ్‌ హుసేన్‌ అమరులవుతారు. పదవ రోజు ఆషూరా రోజున షియా ముస్లిములు అమరవీరులకు ఆల్విదా తెలుపుతూ గుండెలు బాదుకొని రక్తం చిందిస్తారు. సున్నీ ముస్లిములు మాత్రం ఆ రోజు ఉపవాసం ఉంటూ ప్రార్థనలు జరుపుతారు.

Leave a Reply