సౌదీలో ట్రైన్‌ డ్రైవర్లుగా మహిళలు

సౌదీలో ట్రైన్‌ డ్రైవర్లుగా మహిళలు

మక్కా, మదీనాలో రైళ్ళను నడిపేందుకు మహిళా డ్రైవర్లను తీసుకుంటున్నారు. సౌదీలో రైళ్ళను నిర్వహిస్తున్న స్పానిష్‌ రైల్వే కంపెనీ రెన్ఫే ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. 30 మంది మహిళా డ్రైవర్ల కోసం ప్రకటన వేయగా,28,000 దరఖాస్తులు వచ్చాయి. విద్యార్హతలతో పాటు ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలించిన తరవాత సగం మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. మార్చి నెలలో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. దాదాపు ఏడాది పాటు వీరికి జీతంతో కూడిన ట్రైనింగ్‌ ఇస్తారు. తరవాత మక్కా, మదీనా నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు నడిపేందుకు నియమిస్తారు.2017 వరకు అంటే మొహమ్మద్ బిన్‌ సల్మాన్‌ సౌదీ యువరాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరవాత వివిధ ఉద్యోగాల్లో మహిళలను తీసుకుంటున్నారు. గడచిన అయిదేళ్ళలో లేబర్‌ మార్కెట్‌లో మహిళా అభ్యర్థులు సంఖ్య రెట్టింపు అయింది.

Related Articles

Leave a Reply