సౌదీలో రంజాన్‌ నెల ప్రారంభం

సౌదీలో రంజాన్‌ నెల ప్రారంభం

నిన్న నెలవంక కన్పించడంతో ఇవాళ్టి నుంచి సౌదీ అరేబియాలో రంజాన్‌ నెల ప్రారంభైమంది. సౌదీతోపాటు మరికొన్ని దేశాల్లో కూడా రంజాన్‌ నెల మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, అర్మేనియా, ఆస్ట్రియా, అజర్‌బైజాన్, బహ్రెయిన్, బెల్జియం, బొలీవియా, బల్గేరియా, బుర్కినా ఫాసో, చెచెన్యా, డెన్మార్క్, ఫిన్‌లాండ్, జార్జియా, హంగేరి, ఐస్‌లాండ్, ఇరాక్ ( సౌదీని అనుసరించే సున్నీలు), ఇటలీ, జపాన్, జోర్డాన్, కజాకిస్తాన్‌, కువైట్‌, కిర్గిస్తాన్‌, లెబనాన్, మారిటానియా, నెదర్లాండ్స్, పాలస్తీనా, ఖతర్, రుమేనియా, రష్యా, సింగపూర్, సుడాన్, స్వీడన్, స్విట్జర్లాండ్, సిరియా, తైవాన్, తజికిస్తాన్, తాతరస్తాన్‌, టోగో, తుర్కెమెనిస్తాన్, యూఏఈ, బ్రిటన్‌, ఉజ్బెకిస్తాన్‌, యెమెన్ దేశాల ప్రజలు కూడా ఇవాళ రంజాన్‌ నెల తొలి రోజును జరుపుకుంటున్నారు.
వారానికి మూడు రోజులు
రంజాన్‌ నెల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిదినాలుగా ఉంటాయని యూఏఈ ప్రకటించింది. శుక్ర, శని, ఆది వారాలు సెలవు దినాలుగా పేర్కొంది. మిగిలిన నాలుగు రోజులు కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని పేర్కొంది.

Related Articles

Leave a Reply