ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం

ప్రకాశం జిల్లాలో హిజాబ్ వివాదం

 

కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం క్రమంగా బయటి రాష్ట్రాలకు పాకుతుంది. నిన్నటికి నిన్న విజయవాడలో హిజాబ్‌ వివాదం సద్దుమణగకముందే నేడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు తాకింది. ముస్లిం బాలికలు హిజాబ్‌తో తరగతులకు హాజరుకావొద్దని వికాస్‌ హైస్కూల్‌ యాజమాన్యం ఆదేశించడంతో వివాదం మొదలైంది. వెంటనే పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకొని ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నించారు. స్కూల్‌ముందే ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వికాస్‌ పాఠశాల వద్దకు చేరుకున్నారు. పరిస్థితి చేయిదాటకముందే యాజమాన్యం క్షమాపణలు చెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. అసలు ఎర్రగొండపాలెం పట్టణంలోని చైతన్య హైస్కూల్‌ ఈ వివాదానికి కేంద్రబిందువుగా చెబుతున్నారు. ఇక్కడ గత రెండు మూడు రోజులనుంచి ముస్లిం పిల్లలను హిజాబ్‌తో రానివ్వడంలేదని తెలిసింది. దీంతో చైతన్య హైస్కూల్‌ ఎదుట కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు నేడు నిరసన చేపట్టారు. ఆ తరువాత ముస్లిం పెద్దలు ఈ ఘటనపై ఎంఈవోకు పిర్యాదు చేశారు. మద్యాహ్నం ఈ రెండు పాఠశాలల యాజమాన్యాలు, ముస్లిం పెద్దలతో ఎంఈఓ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం తరువాత ముస్లింలు తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశముంది.

Related Articles

Leave a Reply